Monday, February 11, 2008

విలువ

కదిలిపోయిన కాలానికి తెలుసా..?
కరిగిపోయిన సమయం విలువ.
ఊపిరాగిన ప్రాణానికి తెలుసా..?
ఆగిపోయిన జీవితం విలువ.
వదిలేసిన మనసుకి తెలుసా..?
ప్రేమించిన హ్రుదయం విలువ.

Thursday, July 12, 2007

మనసు పలికే మౌనరాగం

మాటల్లో చెప్పలేనిది మనసు పలికే
మౌనరాగం తీయనైన బాధ మనసు పలికే మౌనరాగం
ఎంతో మధురమైనది ఆ తీయనైన బాధ

నీ జ్ఞాపకం

భాధలతో నిట్టూర్చి మనసు బరువెక్కినా
భాధలలో ఓదార్చే మనిషి కరువైనా
జ్ఞప్తికి వచ్చి తృప్తినిచ్చి
ఆనందాన్నిచ్చేది నీ జ్ఞాపకం

Saturday, December 2, 2006

నా చెలి

నా చెలి
నిన్ను గడచిన గతంలా భావిద్ధామంటే
రాత్రి నా మనసులో విహరిస్తావు
కరిగిన కలలా చెరిపేద్దామంటే
ఉదయం నా మనసున ఉదయిస్తావు