మనసు పలికే మౌనరాగం
Tuesday, March 11, 2008
మరుపెరుగని మనసు
మనసు మార్గంలో మౌనంగా నడుస్తొంటే ఎదురుగా నీవు!
నేను జ్ఞాపకమున్నానా? అని నీ ప్రశ్న రెండచుల ఖడ్గమయ్యింది
యదను చిద్రం చేసింది, కన్నీరు ఘోషించింది...
నిను మరువలేని మదికి జ్ఞాపకానికర్థం తెలియదని...
Monday, February 11, 2008
విలువ
కదిలిపోయిన కాలానికి తెలుసా..?
కరిగిపోయిన సమయం విలువ.
ఊపిరాగిన ప్రాణానికి తెలుసా..?
ఆగిపోయిన జీవితం విలువ.
వదిలేసిన మనసుకి తెలుసా..?
ప్రేమించిన హ్రుదయం విలువ.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)