Thursday, November 22, 2012

నీ వరస నీదె హౄదయమా


నీ వరస నీదె
హౄదయమా నిలబడవేంటే
ఏం ఒరుగుతుందె
నువ్విలా త్వరపడిపోతె
నీ అలక అలసట తీర్చింద ఈ పయనంలో
నీ దుడుకు తోడుగా వస్తోంద ఈ సమయంలొ
ఒకరే వుండి ఏం లాభం
ఒక్కటైతేనె అందం
జతలోన జగడం సహజం
ఇది ఈ పరువం నైజం
నీ వరస నీదె
హౄదయమా నిలబడవేంటే
ఏం ఒరుగుతుందె
నువ్విలా త్వరపడిపోతె
ఒక్కో క్షణం చిరాకు పడినా మరో క్షణం భరించదా 
ఒక్కో క్షణం పరాకు ఉన్నా నిరంతరం స్మరించదా
చిరాకుకే చిరాయువుందా!
పరాకులో పట్టింపులా!
చిరు జల్లుల సవ్వడి మధ్యలొ
ఆ ఉరుముల సందడి ముందర
చిరి నవ్వులు రువ్విన పెదవితో
కసురుకుందని వెంటనె వేరై పోద
నీ వరస నీదె
హౄదయమా నిలబడవేంటే
ఏం ఒరుగుతుందె
నువ్విలా త్వరపడిపోతె
నీలొ తనే ఉన్నాదనేది నిజం అని తెలియదా
నీతో తనే ఉండాలనేది నువ్వే కోరె ఫలం కదా
నీ వరస నీదె
అహాలనె తెరల్ని తెంచే ముహుర్తమే ముందుందిగా
తను నీకేం శత్రువు కాదుగ
తనపై కక్షలు లేవుగ
అయ్యిందెదొ అయ్యిందని మరచిపొమ్మని
రమ్మని కమ్మగ చెబుతావ
ఒకరే వుండి ఏం లాభం
ఒక్కటైతేనె అందం
జతలోన జగడం సహజం
ఇది ఈ పరువం నైజం
నీ వరస నీదె
హౄదయమా నిలబడవేంటే
ఏం ఒరుగుతుందె
నువ్విలా త్వరపడిపోతె

 రోటీన్ లవ్ స్టొరీ నుంచి

Monday, July 2, 2012

ప్రియుని ఊహ

వసంత కోయిల గానాం ఈ నవ కోమలాంగి తీయ్యని రాగం

ఆకాశాన ఆశల పయనం నా సాహితమ్మ ఊహల గీతం


మంచు కన్నా చల్లని నైజం మరువలేని నా నిర్చెలి హృదయం


హాయిగొలుపు వెన్నెల వైనం హొయలు ఒలుకు ఆ చిరునవ్వుల రూపం



http://kanakajichittineni.blogspot.in

అమ్మ

కరుణ అను సంద్రం చిలికినప్పుడు ఉదయించిన కమ్మని కావ్యం అమ్మ
కల్మషం లేక తన కమ్మని ప్రేమని పంచుటకు ఇలలో వెలిసిన దైవం అమ్మ
పట్టుపురుగుల తానూ పోతూ కూడా నీకు మంచి చెయ్యాలనుకునేది అమ్మ
నీవు తన గుండెలపై తన్నినా ఓర్పుతో నీ ఆకలిని తీర్చి తన ఔదార్యాన్ని పంచేది అమ్మ
కఠినంగా ఆమె హృదయాన్ని గాయపరిచిన తన చల్లని దీవెనలు ఇచ్చేదే అమ్మ

http://kanakajichittineni.blogspot.in

Sunday, June 17, 2012

కాలం

గడియారం నుండి జారిపోతున్న ప్రతీ క్షణాన్ని
ఒడిసి పట్టి గుండెల్లో బంధించేస్తున్నాను -అనుభూతుల రూపం లో

ప్రతీ క్షణం వెళుతూ వెళుతూ తన
విలువను పెంచుకుంటోంది -గతమై మిగిలి

నేడు లో మరణించింది... అయినా
నిన్న లో కుడా గొప్ప గా బ్రతికేస్తుంది -చరిత్ర 

http://snehama.blogspot.in

Friday, June 15, 2012

చిరుగాలి కోపానికి..

అలుపు తీర్చే చిరుగాలి
అలిగి సుడిగాలైపోతే
చిగురుటాకులా వణికిపోతున్నాను..!
కానీ..
ఈ సుడిగాలి జడివాన కురిపించి
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే
ఆ ధారల్లో తడిసి మురిసిపోతానుగానీ
ఎండుటాకులా దూరం గా ఎగిరిపోను

నేటి మనిషి

రాయి కనబడితే చాలు...
ఆగి మొక్కేస్తాం !
అదే రాయి
బియ్యంలో కనిపిస్తే...
శాపాలు పెట్టేస్తాం !!

కన్నీళ్ళు

పొదుపుగా
వాడుకోవాల్సింది..
నీళ్ళనే కాదు,
కన్నీళ్ళని కూడా!!!

Thursday, June 14, 2012

అద్దంమీద బొట్టుబిళ్ళ

ఊరెళ్ళిన
మా ఆవిడని
పదే పదే గుర్తుచేస్తూ
వెక్కిరిస్తోంది....
అద్దంమీద బొట్టుబిళ్ళ!!!

మనసు

ఈ మనసెప్పుడూ ఇంతే...
ఇచ్చేదాకా ఏడుస్తుంది!
ఇచ్చేశాక ఏడిపిస్తుంది!!

బాధ

మనసులో బాధ..
నీకు చెప్పుకుందామంటే
గొంతు మూగబోయింది!
కనీసం...
కన్నీళ్ళకైనా
మాటలొస్తే 
బాగుణ్ణు!!!

రేపటి కానుక

నిజాన్ని అద్దంలోంచి చూస్తూ
అబద్దంలో
హాయిగా తిరిగేస్తున్నాం

ఆకలి కేకలు వింటూ
అయ్యోపాపమంటూ
నిట్టూర్చి వదిలేస్తున్నాం

సుఖాన్ని పెంచుకుని
సంతోషాన్ని కుదించుకుని
మరమనుషుల్లా మిగిలిపోతున్నాం

విలువమారే కాగితాన్ని చూపిస్తూ
మాకేం తక్కువంటూ
ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం

ఎంతో విజ్ఞానం సంపాదించి
అంతటి విశ్వాన్ని చేధించి
పచ్చటి దారిలో ముళ్ళ తివాచీలేస్తున్నాం
రేపటి తరానికి ఎడారుల్ని కానుకిస్తున్నాం

Wednesday, June 13, 2012

ఓణీ... పరికిణీ...

ఓణీ... పరికిణీ... 
తెలుగు కన్నెపిల్లకు 
అర్ధాంతన్యాసాలంకారాలు 
అప్పుడే మీసాలు మొలుస్తున్న 
కుర్రాడికి... 
ఓణీయే ఓంకారం !! 
పరికిణీయే పరమార్థం !!