సాగర తీరం చల్లని పవనం
వెచ్చని కిరణం కోకిల గానం
మయూర నాట్యం
అన్ని కలిసిన ప్రక్రుతి అందం నీ స్నెహం
Wednesday, November 9, 2011
Friday, October 28, 2011
ప్రేమ
ఏం మాయ చేసేవే నా గుండెకి,
నను వీడి చేరింది నీ గూటికి.
ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.
...
ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.
ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.
ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి.
నను వీడి చేరింది నీ గూటికి.
ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.
...
ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.
ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.
ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి.
Sunday, September 18, 2011
వీడ్కోలు
ప్రతి క్షణం ఎదురుచూపు
ఎందుకో ఈ ఉలుకుపాటు
వస్తుందో రాదో తెలియని ఆ పలకరింపు
వస్తే ఇస్తుంది మైమరపు
రాకుంటే ఉండదు కంటికి కునుకు
వద్దనుకున్న అవుతాయి ఈ నిలవని పరిచయాలు
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సు
వీడి వెల్లిననాడు మాత్రం ఇస్తాయి బారమైన కన్నీలు !
ఎందుకో ఈ ఉలుకుపాటు
వస్తుందో రాదో తెలియని ఆ పలకరింపు
వస్తే ఇస్తుంది మైమరపు
రాకుంటే ఉండదు కంటికి కునుకు
వద్దనుకున్న అవుతాయి ఈ నిలవని పరిచయాలు
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సు
వీడి వెల్లిననాడు మాత్రం ఇస్తాయి బారమైన కన్నీలు !
ఆశ
మాట రాక తడబడే నీ ముందర ఆ క్షణాలు
నిజంగా నీ మాటలు అక్షర లక్షలు
నీ ముందుకు రాలేని, చెప్పలేని బిడియాలు
నీ కంటి పాపలో నా రూపు చూడలేక సిగ్గులు
నిను వీడలేక వెల్లలేని ఆ తీయని బాధలు
నీ ముందర నిలుచుంటే ఆగలేని గుండె జల్లులు
సిగ్గువిడిచి చెబుతున్నా నాలోని భావాలు
నీ హ్రుదయాన దాగుండాలని ఏవో ఆశలు !
నిజంగా నీ మాటలు అక్షర లక్షలు
నీ ముందుకు రాలేని, చెప్పలేని బిడియాలు
నీ కంటి పాపలో నా రూపు చూడలేక సిగ్గులు
నిను వీడలేక వెల్లలేని ఆ తీయని బాధలు
నీ ముందర నిలుచుంటే ఆగలేని గుండె జల్లులు
సిగ్గువిడిచి చెబుతున్నా నాలోని భావాలు
నీ హ్రుదయాన దాగుండాలని ఏవో ఆశలు !
Thursday, March 3, 2011
ప్రేమ-స్నేహం
ఒక చంప పై నిశబ్దం గా జారే కన్నీటి
చుక్కను తుడవటానికి మరో హృదయం
పడే తపన ప్రేమ ........!
అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా
ఆరాటపడే హృదయమే స్నేహం
చుక్కను తుడవటానికి మరో హృదయం
పడే తపన ప్రేమ ........!
అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా
ఆరాటపడే హృదయమే స్నేహం
Wednesday, February 16, 2011
ఎదురుచూపు..
మాటల కొటలలో నిన్నే మైమరిపించి
చేతల నాట్యం లో నిన్నే సవరించి
మదురమైన వేలలో కనులని ముద్దాడి
కలవరపడి కనులు తెరవగా సమయం సందించింది
నీ ఊహ నా మదిని భందించింది
మరల కనులు మూయగా రాత్రి నవ్వి పగలుతో చేయి కలిపింది
నా చేరువైన ఆనందాన్ని మరల తన చీకటిలో దాచేసుకుంది
మళ్ళీ రాత్రి కోసం నా మది వేయి కన్నులతో ఎదురుచూస్తుంది.. !
చేతల నాట్యం లో నిన్నే సవరించి
మదురమైన వేలలో కనులని ముద్దాడి
కలవరపడి కనులు తెరవగా సమయం సందించింది
నీ ఊహ నా మదిని భందించింది
మరల కనులు మూయగా రాత్రి నవ్వి పగలుతో చేయి కలిపింది
నా చేరువైన ఆనందాన్ని మరల తన చీకటిలో దాచేసుకుంది
మళ్ళీ రాత్రి కోసం నా మది వేయి కన్నులతో ఎదురుచూస్తుంది.. !
Subscribe to:
Posts (Atom)